Saturday, July 31, 2010

ఈ కాలం చదువులు.....!!!!1

ఏంటో కాలం చదువులు ఎలా తయారు అయ్యయ్ అంటే......పైకి పెద్ద పోడిచేవాళ్ళలాగ తెగ పోజుకొడతారు...ఇంకొకల్ని అనడం ఎందుకులెండి....యదా విది గా నన్నే అనుకుంటా.....నేను ఏం తక్కువ కాదు. నేనూ భాపతి కి చెందిన దాన్నే ...

కాలేజీ కి వెళ్తామా,క్లాసు జరుగుతుంటే కళ్ళు తెరిచి నిద్ర పోవడం(నేను)....అమ్మాయిలు అయితే కాబోయే వాడి గురించిఆలోచించడం,అబ్బాయిలు అయితే అమ్మాయిని పడెయ్యాలి, అమ్మాయి మన వంక చూస్తుందా ... అమ్మాయిబాగుందా అనే ...పుస్తకం పై ద్యాస ఉండదు....ఆఁ అసలు ఎందుకు వుండాలి అండీ....అసలు మనం ఎందుకుచదవాలి.... పుస్తకాల్లో వున్నవి ఏం ఉపయోగ పడతునాయ్ .......

ఉదాహరణకు .......మనం బ్యాంకు లో పని మీద వెళ్తాం మనీ డ్రా చెయ్యాలో డిపాజిట్ చెయ్యాలో ఏదో పని వుందిఅక్కడ ఒక స్లిప్ వుంటుంది..దాన్నినింపి ఇస్తే నే పని అవుతుంది అని మన పుస్తకాల్లో రాసి ఉండదు...మరి ఎందుకుచదవాలి అండి మనం పుస్తకాలని.....


క్లాసు లో ఎప్పుడూ ఇవ్వన్నీ చెప్పరూ...మళ్లీ నిజ జీవితం లో ఏదైనా పొరపాటు చేస్తే ఎగతాళి గా....ఫలాన చదువుచదువుతున్నావు ఆఁ మాత్రం చెయ్యలేవా అంటారు....మళ్లీ సామెతలు..."చదువుకున్న వాడికంటే చాకలి వాడుమేలు"....అని ...నిజమే చదువులు మానేసి చాకలి పని చేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది...


ఇంకా పరిక్షలు రాసే విధానం.....ఇవి రకరకాలు .....

....
  • పక్కోడి దానిలో కాపి కొట్టవచ్చు
  • మనమే స్లిప్పులు తీస్కుని వెల్ల వచ్చు
  • కాంపస్ లో ఎవడో ఒకడిని తగులుకుని పరీక్షా పేపరు ముందే తెలుసుకోవచ్చు
  • బుద్ధిగా చదువుకోవచ్చు
  • మేనేజుమెంటును మేనేజ్ చేసి కాపీ లు ఎరెంజి చేయించుకోవచ్చు
అది సంగతి......ఇంకా పరీక్ష కి చదివే విధానం చూడాలి....అంత క్రికెట్ అభిమానులే గా.....ఇంకా అంతా one day batting టైపు.....పరిక్షకి ఒక్క రోజు ముందు సరిగ్గాఒక్క రోజే ముందు మళ్లీ ఎక్కువ చదివితే నాశనంఅయిపొమూ...ఏదో అలా అలా ఎవడికి తోచిన రీతిలో (పైన చెప్పబడిన రీతి లో) దూసుకు వెళిపోవడమే .....

రాసే విధానం: కొందఱు పేపర్ ని పొదుపు గా వాడితే కొందఱు వాళ్ళ ఇష్టం....వాడు అడిగినా అడగక పోయినా వీడికితెలిసింది రాసి వస్తాడు....వీడు రాసిన పేపర్ తో ఇంకో పుస్తకం అచ్చు వేయించోచ్చు..అంత గొప్ప కవి వాడు..పేపర్ దిద్దేవాడికి పిచ్చి ఎక్కాలి.....కొందరు మహానుభావులు పాపం ఏదో రాసాడు లే అని ముష్టి వేస్తారు...ఇలా ఎవరికీ నచ్చిన రీతివాడు రాసుకేళ్ళడమే ...కొందరు వుంటారు వీడికి తెలిసినా పక్కోడు తప్పు రాస్తే అదే రాసి వస్తాడు ....వీళ్ళని దండ వేసిదణ్ణం పెట్టి కేటగిరీలో వెయ్యాలి....కొందరు పక్కోడు పాపం అని రైటూ ఆన్సరు చెప్పినా వీడు మొండి వాడు..విడు పట్టినకుందేలుకు మూడు మూడు ముప్పైఅరు అంటాడు ...వీడిని ఆఁ చుక్కా రామయ్య కూడా ఏమి చెయ్యలేడు....అంత మేధావి .....


ఇంకా జాబులు అంటారా...అవి అన్నీ స్కిల్లు బట్టే గా....ఏదో కోర్సు జాయిన్ అయ్యేది.....(రెఫెరెన్సు) మీదకొట్టేయోచ్చు,లేదా backdoor (లంచం) ఇవ్వడమే .....తర్వాత బాస్ గాడే వొళ్ళు వంచిపిచ్చి పనిచేయించుకుంటాడు....అది వేరే విషయం లెండి....


అదీ సంగతి...ఇంకా ఆరాం గా కళ్ళు మూసుకుని తొంగోండి .....చదువులు వద్దు చట్ట బండలు వద్ధూ...గాలి తిరుగుళ్ళుతిరిగితేనే లోక జ్ఞానం తెలుస్తుంది.. పద్ధతి నేను చెప్పింది కాదు...పురాణాల్లో కూడా వుంది..పూర్వం రాజులు లోకజ్ఞానం కోసం దేశాలు పట్టి తిరిగేవాళ్ళు అంట...ఇంకా లేట్ ఎందుకు..గాలి తిరుగుళ్ళు మొదలు పెట్టండి.....నేను ప్రస్తుతంఅదే పని లో వున్నా...ఎందుకంటే నేను చేసేదే చెప్తా చెప్పిందే చేస్తా

4 comments:

murali said...

i agree with you........
నిజమే పెద్ద పెద్ద చదువులు చదివి ఏం లాభం......!
లోక జ్ఞానాన్ని స్కూల్ లో,కాలేజీ లో నేర్పించరు కదా ....!
మనం చదివేది ఒకటి బ్రతకడానికి చేసేది ఇంకొకటి.ఒకదానికొకటి సంబంధం ఉండి చావదు.
అందుకే బయట తిరిగే వాడు ఏ పని అయిన చేయగల్గుతాడు.చదువుకునే వాడికి, అది తప్ప ఇంకోటి తెలిసి చావదు.
surya son of krishnan movie lo ilage oka dialogue untundi...
"ఒక మనిషి road మీదకి వెళ్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి అని...".
మనకి క్లాసు లో ఉండి ఏం వచ్చిందని ...... గుడ్డి సున్నా...అసలు తప్పు system లో ఉంది.
correct dialogues "JOSH" movie lo untayi........ inka chala cheppalani undi.... malli chepathale...

Anonymous said...

neku chaduvu meda interset ledu kada anuduke ela rasav

pradu said...

eentandi... inkaa AA gaali thirugudu aapi.. maaku lookagnanam boodinchandi....

GARAM CHAI said...

nice topic
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg