Saturday, July 31, 2010

ఈ కాలం చదువులు.....!!!!1

ఏంటో కాలం చదువులు ఎలా తయారు అయ్యయ్ అంటే......పైకి పెద్ద పోడిచేవాళ్ళలాగ తెగ పోజుకొడతారు...ఇంకొకల్ని అనడం ఎందుకులెండి....యదా విది గా నన్నే అనుకుంటా.....నేను ఏం తక్కువ కాదు. నేనూ భాపతి కి చెందిన దాన్నే ...

కాలేజీ కి వెళ్తామా,క్లాసు జరుగుతుంటే కళ్ళు తెరిచి నిద్ర పోవడం(నేను)....అమ్మాయిలు అయితే కాబోయే వాడి గురించిఆలోచించడం,అబ్బాయిలు అయితే అమ్మాయిని పడెయ్యాలి, అమ్మాయి మన వంక చూస్తుందా ... అమ్మాయిబాగుందా అనే ...పుస్తకం పై ద్యాస ఉండదు....ఆఁ అసలు ఎందుకు వుండాలి అండీ....అసలు మనం ఎందుకుచదవాలి.... పుస్తకాల్లో వున్నవి ఏం ఉపయోగ పడతునాయ్ .......

ఉదాహరణకు .......మనం బ్యాంకు లో పని మీద వెళ్తాం మనీ డ్రా చెయ్యాలో డిపాజిట్ చెయ్యాలో ఏదో పని వుందిఅక్కడ ఒక స్లిప్ వుంటుంది..దాన్నినింపి ఇస్తే నే పని అవుతుంది అని మన పుస్తకాల్లో రాసి ఉండదు...మరి ఎందుకుచదవాలి అండి మనం పుస్తకాలని.....


క్లాసు లో ఎప్పుడూ ఇవ్వన్నీ చెప్పరూ...మళ్లీ నిజ జీవితం లో ఏదైనా పొరపాటు చేస్తే ఎగతాళి గా....ఫలాన చదువుచదువుతున్నావు ఆఁ మాత్రం చెయ్యలేవా అంటారు....మళ్లీ సామెతలు..."చదువుకున్న వాడికంటే చాకలి వాడుమేలు"....అని ...నిజమే చదువులు మానేసి చాకలి పని చేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది...


ఇంకా పరిక్షలు రాసే విధానం.....ఇవి రకరకాలు .....

....
  • పక్కోడి దానిలో కాపి కొట్టవచ్చు
  • మనమే స్లిప్పులు తీస్కుని వెల్ల వచ్చు
  • కాంపస్ లో ఎవడో ఒకడిని తగులుకుని పరీక్షా పేపరు ముందే తెలుసుకోవచ్చు
  • బుద్ధిగా చదువుకోవచ్చు
  • మేనేజుమెంటును మేనేజ్ చేసి కాపీ లు ఎరెంజి చేయించుకోవచ్చు
అది సంగతి......ఇంకా పరీక్ష కి చదివే విధానం చూడాలి....అంత క్రికెట్ అభిమానులే గా.....ఇంకా అంతా one day batting టైపు.....పరిక్షకి ఒక్క రోజు ముందు సరిగ్గాఒక్క రోజే ముందు మళ్లీ ఎక్కువ చదివితే నాశనంఅయిపొమూ...ఏదో అలా అలా ఎవడికి తోచిన రీతిలో (పైన చెప్పబడిన రీతి లో) దూసుకు వెళిపోవడమే .....

రాసే విధానం: కొందఱు పేపర్ ని పొదుపు గా వాడితే కొందఱు వాళ్ళ ఇష్టం....వాడు అడిగినా అడగక పోయినా వీడికితెలిసింది రాసి వస్తాడు....వీడు రాసిన పేపర్ తో ఇంకో పుస్తకం అచ్చు వేయించోచ్చు..అంత గొప్ప కవి వాడు..పేపర్ దిద్దేవాడికి పిచ్చి ఎక్కాలి.....కొందరు మహానుభావులు పాపం ఏదో రాసాడు లే అని ముష్టి వేస్తారు...ఇలా ఎవరికీ నచ్చిన రీతివాడు రాసుకేళ్ళడమే ...కొందరు వుంటారు వీడికి తెలిసినా పక్కోడు తప్పు రాస్తే అదే రాసి వస్తాడు ....వీళ్ళని దండ వేసిదణ్ణం పెట్టి కేటగిరీలో వెయ్యాలి....కొందరు పక్కోడు పాపం అని రైటూ ఆన్సరు చెప్పినా వీడు మొండి వాడు..విడు పట్టినకుందేలుకు మూడు మూడు ముప్పైఅరు అంటాడు ...వీడిని ఆఁ చుక్కా రామయ్య కూడా ఏమి చెయ్యలేడు....అంత మేధావి .....


ఇంకా జాబులు అంటారా...అవి అన్నీ స్కిల్లు బట్టే గా....ఏదో కోర్సు జాయిన్ అయ్యేది.....(రెఫెరెన్సు) మీదకొట్టేయోచ్చు,లేదా backdoor (లంచం) ఇవ్వడమే .....తర్వాత బాస్ గాడే వొళ్ళు వంచిపిచ్చి పనిచేయించుకుంటాడు....అది వేరే విషయం లెండి....


అదీ సంగతి...ఇంకా ఆరాం గా కళ్ళు మూసుకుని తొంగోండి .....చదువులు వద్దు చట్ట బండలు వద్ధూ...గాలి తిరుగుళ్ళుతిరిగితేనే లోక జ్ఞానం తెలుస్తుంది.. పద్ధతి నేను చెప్పింది కాదు...పురాణాల్లో కూడా వుంది..పూర్వం రాజులు లోకజ్ఞానం కోసం దేశాలు పట్టి తిరిగేవాళ్ళు అంట...ఇంకా లేట్ ఎందుకు..గాలి తిరుగుళ్ళు మొదలు పెట్టండి.....నేను ప్రస్తుతంఅదే పని లో వున్నా...ఎందుకంటే నేను చేసేదే చెప్తా చెప్పిందే చేస్తా

Thursday, December 10, 2009

పాపం పసిదాన్ని !!!

జాబు జాబ్ అని చంకలు గుద్దుకునంత సేపు లేదు నా ఆనందం...... మాయదారి మార్కెట్ ఇప్పుడే పడిపోయి మూలిగేనక్క (నా) మీద తాటి కాయ వేసి పోయింది..... ఒకటా రెండా ముఛట గా మూడు కంపెనీ లు ....

ఎం చేస్తాం అర్య౨ లో "my lov is gone" అని "my job is gone" అని పాడుకుని ఇంక చేసేది ఏమి లేక బుద్దిగా చదువుకుందాం అని కాలేజి లో జేరా ......

దేవుడు ఇక్కడ కూడా చిన్న చూపు చూసాడు.. తిస్కేల్లి అమ్మాయిల కాలేజిలో పడేసాడు....ఛి..చీ జీవితం లో కలరిన్గ్ లేకుండా పోయింది ....నన్ను చూస్తే అయ్యో పాపం పసిది అనిపిస్తుందా...హ్మ్...అంతేలెండి ...


పోనిలే ఏదోటి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే చెప్పుకోలేని చోట సేగ్గేడ్డలు చావగోడుతున్నాయి .......

నా బాధలో నే వుంటే మహానుభావుడు కెసిఆర్ గారు...తెలంగాణా, తొక్క, తోలు అంటు ధర్నాలు,బంద్లు..... సీను కట్చేస్తే మళ్ళి సెలవులు...ఎం చేస్కోవాలి అన్ని సెలవులు ...పిచేక్కి పక్కనే ఎర్రగేడ్డలో జాయిన్ అవుదాం అనుకున్నా కానీ బెడ్స్ కాళి లేవంట.... అక్కడ కూడా నిరాశే ...


ఏంటో గోలా......జీవితంలో కిక్ లేకుండా పోయిన్ధబ్బ.....మీకు తెలిసిన సలహాలు ,సూచనలు వుంటే పంపుదురు జీవితం హాయిగా గడపడానికి ....కిక్ లేదు అన్నాను కదా అని ఒక quater వేసి పడుకో బంగారం అని చెప్పకండే .......అసలే నేను పసిదాన్ని ,పాడు అలవాట్లు లేని దాన్ని ".నిజమండి బాబు


Saturday, April 11, 2009

ఘనకార్యాలు

అబ్బ!! మొత్తానికి ఇంటర్వ్యూ పాస్ అయిపోయాను ...ఇంకా మిగిలింది జాయిన్ అవడమే ...పాపం ఆ కంపెనీ వారు నన్ను ఎలా భరిస్తారో .....నాకు మాత్రం వాళ్ళ మిద పిచ్చ జాలిగా వుంది ...సరేలెండి ఎవరి కర్మ కు ఎవరు భాద్యులు.........మొత్తానికి భయటి ప్రపంచం లోకి అడుగుపెడుతున్న......అదేంటో కొంచెం టెన్షన్ గా వుంది....(నా లాంటి క్వీన్ విక్టోరియాలకు కూడా భయం వేస్తుందా !!!!???!!!)..ఎప్పుడు ఇలా అనిపించలేదు......ఆఖరికి నేను చేసిన వంట తినే ముందు కూడా ......



వంట అంటే గుర్తుకు వచ్చింది.........అదేంటో చిన్నపట్టినుంచి ఆడపిల్ల లక్షణాలు నాలో ఒక్కటి కూడా లేవు......కనీసం భూతద్దం పెట్టి వెతికినా దొరకవు............ఒకసారి ఇలా కాదు అనిపించి వంట చేద్దాం అనుకుని మొదలు పెట్టా ........"వంట"..అనే ఇంత పెద్ద పేరు అవసరం లేదు అనుకుంట నేను తయారు చేసిన ఐటెం కి..........ఇంతకి ఏంటి అనుకుంటున్నారా.....చపాతీ.....



తయారు చేసే విధానం: ముందుగా చపాతీ ఏ పిండి తో చేస్తారా అని అలోచించడం,ఏ పిండో నిర్ణ్యించుకున్నాక ,దానిలో కాస్త నిరు పోసి ,కావాలంటే వుప్పు,ఇంక మీరు ఏదైనా చెత్తా చెదారం వెయ్యాలి అంటే వేసుకోవచ్చు .........వేసి,ముద్ధలా కలుపుకుని చపాతీ shape ల సాగదీసి పెనం మీద వేసి కాల్చడమే.......(చాలా సింపుల్ కదా)



ఇంక నేను తయారు చేసిన విధం: ముందుగా పిండి........ఏ పిండి ??...(చాలా సేపు వెతికాక కనిపించింది ఎదో తెల్లటి పిండి........రుచి చూసా......ఏమి తెలియడం లేదు........వాసనా చూసా.....లాభం లేదు.......ఇంక ఆపరేషన్ స్టార్ట్ చెయ్యలి అని నిర్ణయించుకుని .....మొదలు పెట్టా.........ఆ పిండిలో కాస్త నిరు పోసి (పోయ్యకనే బుస్స్ మని సౌండ్,ఎందుకో తెలియదు),బంగాళా దుంప వుడక బెట్టి...ముద్దగా చేసి దాని లో కలిపా..........ఇంక....చపాతీ shape లో చేద్దాం అని ...పిండి తీస్తుంటే.......బంకలాగా సాగుతుంది..........ఇంక చపాతీ shape ఎలా వస్తుంది ?.......టైం గడిచిన కొద్ధీ......నీరు కక్కేస్తుంది...ఇంక లాభం లేదు అనుకుని...డైరెక్ట్ గా పెననికి అంటిన్చేసా ఆ పిండిని.........కాస్త వేడి అయ్యాక తిరగేసి...నేను మా అమ్మమ్మ గారు తిన్నాం(ఆవిడ లెగలేరు లెండి,ప్రస్తుతం స్వర్గం లో వుండివుంటారు...ఈ రోజుకు రెండు నెలలు ఆవిడ చనిపోయి)...........సరే.......తిన్నాం....బాగుంది అంటే..భాగుంది అనుకున్నాం........



మా అమ్మ షాప్ నుంచి రాగానే...నేను చేసిన ఘనకార్యం .గురించి చెప్పి నాకున్న అనుమానం ఆ పిండి ఏంటి ఇంతకి ఎందుకు ఇలా నిరు కక్కేసింది అని అడిగాను ..ఆ పిండి చుపిస్థూ........మా అమ్మ ఫక్కున నవ్వి దినితోనేన చపాతీ చేసావ్.....ఎలా వచ్చింది? ...... ?..... నన్ను ఎదురు ప్రశ్నలు వేసి ........మా పెద్దమ్మ వాళ్ళకు ఫోన్ చేసి మరీ..."అక్క అను ఇవాళ కొత్తప్రయోగం చేసింది..... tittleవచేసి "గంజిపొడి చేపతి" ......



ట్విస్ట్ అద్దిరింది అనిపించింది..........కొంచెం అవమానం గా .......తలుచుకుంటే నవ్వు వచ్చింది..........కానీ ఏమాటకు ఆ మాట...చేపతి చాలా..చాలా బాగుందండి.........మీరంతా కూడా ట్రై చెయ్యొచ్చు...... నాదీ గ్యారెంటీ ......హ హ..హ .హ్హ.....



నాకు ఇంకో విషయం గుర్తుకు వస్తుంది...........నా చిన్నపుడు...... అప్పుడు నేను 2nd క్లాసు ఏమో.......(మీ కళ్ళ ముందు రింగులు తిరుగుతున్నాయా... !!??......)(ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యింది)........ నిద్ర లేచేసరికి వాతావరణం అంత చాలా ప్రశాంతంగా వుంది....వర్షం పడేలా వుంది....టైమ్ ఆరు అవ్వోస్తంది.....స్కూల్ డే ఫంక్షన్ ఆని స్నానం జడ వేయించుకుని... బయల్దేరభోతున్న........ maa అమ్మావాళ్ళు అడుగుతున్నారు.....ఎ టైమ్ కి ఫంక్షన్ అవుతుంది అని...పదింటికి అనిచేప్ప......ఒక్కదానివే వచ్చేయగలవా ......... ఎందుకు ఇలా అడుగుతున్నరో అర్ధం కాలేదు........."వచేస్తనుగా..నేకేం భయం " అన్నా......

మా అమ్మావాళ్ళు చీకటిలో ఒకదానివె ఎలా వస్తావ్ dady తోడు వస్తారులే అన్నారు .... నాకు అర్ధం కాలేదు .. చీకటి ఏమిటి? .......పగలు పదింటికి ప్రోగ్రాం అయ్యేది అన్నా......మా అమ్మవల్లకు సీన్ అర్ధం అయ్యింది.........ఇప్పుడు టైమ్ ఎంత అన్నారు....చూస్తే ౭.౦౦ అవుతోంది...ఇంక తెల్లరడం లేదేంటా అనుకున్నా కూడా ..... ఆతరవాత నాకు సీన్ అర్ధం అయ్యింది...నేను లేచింది పగలు ఆరింటికి కాదు,రాత్రి ఆరింటికి అని......ఛి...ఎంత సిగ్గు వెసిన్ధో ........మా అమ్మవాళ్ళ ముందయితే అనుకోవచ్చు.. మా వీది లో పిల్లందరికి చెప్పేసా....స్కూల్ ఫంక్షన్ కి వెళుతున్న అని.......ఇంక......నా సిగ్గు చూడాలి......అబ్బ ఇప్పటికి తలుచుకుంటే....ఎంత సిగ్గెస్థున్ధో ......అంత మత్తుగా నిద్రపోయాను అన్నమాట....




సరేలెండి...అది సంగతి.........ఇంకా ఇలాంటివి ఏమైనా గుర్తుకు వస్తే మళ్ళి కోత పోస్ట్ తో తర్వాత కలుస్తా.....

Wednesday, March 4, 2009

హైదరా'బాదు'

మొన్నీ మధ్య ఏదో ఇంటర్వ్యూ వుంటే హైదరాబాదు వెళ్ళా.........అందరూ చెబుతుంటే హైదరాబాదు ట్రాఫిక్ గురించి ఏమోఅనుకున్నా,....కానీ ప్రత్యక్షం గా చూసాక గాని అర్ధం కాలేదు......అబ్బ కొంచెం చోటు దొరికితే చాలు ఎలా దూరివెళ్లిపోదామా అనుకుంటూ వుంటారు......కానీ ఏమాటకు మాట వాళ్ళ డ్రైవింగ్ స్కిల్ల్స్ మాత్రంమేచుకోవలసిందే............


ఇంక నాకు బాగా వింత... అనిపించింది ఏమంటే ......బస్సు లో ప్లేస్ కోసం జనం కొట్టుకోవడం చుసాను
గానీ,బస్సే రోడ్మీద ప్లేస్ కోసం కొట్టుకోవడం మొన్నే చూసా......ఇది మరీ చోద్యం లా అనిపించింది.....అంతేలే ఎంతైనా నా ఎర్ర బస్సుకళలు ఎక్కడికి పోతాయి.... సారీ!!!ఇప్పుడు అన్ని పచ్చ బస్సులే కదూ.....సారీ....సారీ


మరీ ముఖ్యం గా చెప్పుకోవలసింది హైదరాబాద్ ట్రాఫిక్ వల్ల వచ్చే కాలుష్యం గురించే......అంటే అది ఎక్కడ వుంటుందాఅని ఎక్కడో చూడక్కర్లేదు...ఒక్క సారి మన మొహాలను పట్టుకుని చూస్తే...పాల మిద మీగడ కట్టినట్లు...ఇంత మందానపేరుకుని వుంటుంది.....అందులో నేను ఇంటర్వ్యూ కి వెళ్ళేప్పుడు తెల్ల రుమాలు తిసుకేల్లా.......అదేదో టీవీ ఆడ్ లోచూపించినట్లు,ఒక్క సారి సబ్బు బిళ్ళ పెట్టి రుద్ద గానే తెల్లని తెలుపు వచ్చినట్లు......ఒక్క సారి తెల్లని రుమాలు పెట్టి నామొహాన్ని రుద్ద గానే నల్లటి నలుపు వచ్చింది......ఇంకేముంది...తెల్లటి రుమాలు కాస్త నల్లటి రుమాలుఅయ్యిన్ధీ.......ఇంకా నా పక్కవారు నేను తెచ్చిన రుమాలు చూస్తే అసహ్యంగా వుంటుందని దాన్ని దాయడానికివిఫలయత్నం చేశాను.....చివరికి నా పేరు పిలవ గానే వొళ్ళు పాయి తెలియకుండా హడావిడిగా లేచేసరికి దాచుకున్నమసిగుడ్డ కాస్త కింద పడింది ....అందరు దర్సనం చేసుకున్నారు నల్ల బంగారాన్ని................


ఇంకా ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళా కదా......నా మొహం చూసే చెప్పేసాడు....ఏంటమ్మా టెన్షన్ గా వుందా అని..........హి హి అని ఒక వెకిలి నవ్వు ఆయన మొహాన పడేసి...మాట్లాడిన మొదటి ముక్కే అబద్ధం చెప్పా..."లేదు సర్" అని..........


ఇంకా ప్రశ్నేల హింస మొదలు.......నన్ను సమాదానం కూడా చెప్పనివ్వకుండా అడిగేస్తున్నాడు........అదేదో సినిమాలో
.. AVS .. గారు మూతి ఇలా పెట్టుకుని అడుగుతారు కదా రేంజ్ లో వున్ధీ అక్కడ........చివరికి చిరాకొచ్చి "ఎహే....#$^$#%&#&....నన్ను చెప్పనివ్వు..%#@$^&%$&"..అని అందము అనుకున్న,,అంటే మళ్ళి సెలెక్టు చెయ్యడెమో అని ఎక్కడలేని నవ్వు తెచుకుని మరీ నవ్వా.....ఎం చేస్తాం తప్పదుకదా.....(కూటి కోసం కోటి విద్యలు అంటేఇదెనెమో) ........


అలా నా 36 పళ్ళు బయట పెట్టటం అయ్యాక...నాకు ఒక విషయం అర్ధం అయ్యింది...మా ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రం కచ్చితంగా పిచ్చి వుంది ..............చూద్దాం... నేను సెలెక్ట్ అయితే...ఆయనకు పిచ్చి..........కాకపోతే నాకు పిచ్చి అని డిక్లేర్ చేద్దాం......(ఇంకా result రాలేదు......వచ్చాక తప్పకుండా ఎవరికీ పిచ్చి అనేది చెబుతాను)......



ఆం.......ఇంకా యువ రాణిగారు హాల్ నుండి బయటకు వచ్చాక....... క్వీన్ విక్టోరియా రేంజ్ లో ఇంటికి వెళదాం అనుకుని....బస్ అయితే లేట్ అవుతుంది అని ఆటో ఎక్కా.......... ఆటో వాడు బాగా తెలివైన వాడు అనుకుంట...నేను ఎర్ర బస్సు(పచ్చ బస్సు) బాపతి అని కనిపెట్టేసి.....తిన్నగా వెళ్ళాల్సింది బాపు బొమ్మ లో కూడా లేనన్ని మెలికలు తిప్పుకుంటూ తీసుకెళ్ళాడు.........చూద్దునుకదా.....మీటర్ 100 రూ పడింది......బస్సు లో పోతే 10 రూ పోయేదానికి 100 రూ చెల్లించా........ఇదేనేమో "గోటితో పోయేదానికి గడ్డలి తేవడం" అంటే........సుబ్బరం గా 2 బస్సులు మారితే 90 రూ.లు మిగిలేవి కదా.....అంతే....ఇంగ్లీష్ లో ఒక వాక్యం వుంది.."winners dont do different things but they do things differently".....అంటే ఇప్పుడు నేను విన్నెర్ అనా.......(మరి అలా అనుకోక పోతే...90 రూ క్షవరం బాద వేదిస్తుందిగా!!!!!!)..............


అది సంగతి..........నాలా కాకుండా.......కొంచెం...పుర్రెలో వున్నా బూడిదరంగు పదార్ధాన్ని వాడండి అని నా టపా ద్వారా అందరికి మనవి చేస్తున్న........

Thursday, January 22, 2009

నా అనుభవం...

గణతంత్ర దినోత్సవం వచేస్తోంది కదండీ......నా మది లో బరువేక్కిపోయిన అనుభవాలను మీతో పంచుకుందామని ఇలా వచ్హా.......

ఒహ్ చెప్పలేదు కదూ నేను ౨౦౦౭ లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలుగోన్నలెండి........NCC కాడేట్ ని నేను అప్పుడు.......


అసలు నేను NCC లో చేరడమే విచింత్రం గా జరిగిందీ......మా NCC మాడం నేను చేరనూ మొర్రో అన్నా వినకుండా నా వెంట పడి మరీ నాకు ఇష్టం లేకపోయినా బలవంతం గా చేర్పించారు..ఎంత చిరాకొచెదో ..NCC లో డ్రిల్ బాగా చెయ్యాలి,అన్ని పనులు బధ్హకమ్ లేకుండా చెయ్యాలి......మరి అదే గా మనకు కష్టమైన పని....ఇంక చూసుకోండి........ఆమె ఎక్కడ కనిపిస్తే చాలు అక్కడ దాక్కునే దాన్ని.....ఇంక మాకు రోజూ దాగుడు ముతలే.....


ఇలా ఒక సమత్సరం గడిపేసా......ఆమె నా పేరు అందరికి చెప్పి అమ్మాయి RD (రిపబ్లిక్ డే పరదే)కి వెళ్తుంది అని చెబుతుండేది.......నాకు చూసుకోఁడి......తిక్క నషాళానికి ఎక్కేది......ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగంఅన్నమాట...పదే పదే గుర్తుకోచేది......


ఆమె అలా ఎందుకు నన్ను బలవంతం గా అయిన NCC లో చేర్పించాలనుకుందూ నాకు తర్వాత అర్ధమైంది.....ముందు సమత్సరం RD చేసినవాళ్ళను చూపించారు.....ఒక కాంప్ చేసాక అందులో వున్నా ఆనందం అర్ధమైంది........ఇంక నిర్ణయించుకున్నా.....ఎలాగైనా RDచెయ్యాలని.......


అంతే... తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.......ఏకం గా ఆంధ్ర ప్రదేశ్ టీం కే లీడర్ ని అయ్యా....ఇంక rajpath పరెడ్ కి కమాండర్ గా కూడా చేశా......అసలు పరెడ్ కి సెలెక్ట్ అవ్వడమే గొప్ప అయితే అన్ధులొనూ కమాండర్ గా అంటే......నాకు నేనే నమ్మలేఖ పోయాను.......


ఇదంతా నా గొప్పతనమే అంటే కఛితం గా..కాదు........నన్ను చూడగానే నా టాలెంట్ ని గుర్తించిన మా మాడెం,మాకోసం కష్టపడి నేర్పించిన NCC సిబ్భంది ,నన్ను ప్రభావితం చేసిన మా seniors,మా NCC ఆఫీసుర్స్ ఎప్పుడు వెన్నుతట్టే వారు,ఇంక భగవంతుడిది..........


ఇంక .. rajpath మీదగా నడుస్తుంటే .......అబ్బ అనుభూతి మాటల్లో చెప్పలేమండి ...... ప్రేక్షక pathra పోషించిన మా కొంతమంది స్నేహితులు మమ్మలి ఒక్కసారి రాజమార్గం meeda నదుస్తుంటే చూసి....వుత్సాహం అపుకూలేఖ.....అరుపులతూ చప్పట్లు కొడుతుంటే......ఆహా....


ఇందులో సుకం తో పాటు ఖష్టం కూడా వుందండి......రాజ్పథ్ అంటే.....రాష్ట్రపతి బవనం నుంచి...ఇండియా గేటు వరుకు వున్నా మార్గం...మొత్తం 4km దాక వుంటుంది........అందులోనూ... రోజు విదెసీయులు కూడా పరెడ్ చూస్తారు కాబట్టి జాగ్రత్త గా వొళ్ళు దగ్గర పెట్టుకు ని మరి చెయ్యాలి.....దేసమంత లైవ్ ద్వార టీవీ లో చూస్తారు......పైగా ఇంటి దగ్గర వాళ్ళు మా పిల్ల టీవీ లో ఎప్పుడు కనపడుతుంద అని ఎదురు చూస్తారు.......ఇన్ని వుద్రేకల మధ్య....5KM..ఆపకుండా...మర్చింగ్ అంటే మాటలు కాదు.......పట్టపగలే చుక్కలు అని విన్న కానీ....అప్పుడే చూసా.....


ఇన్ని భాధలు అనుభవించామ్ కాబట్టే.....ధానికి అంత గౌరవం.......దిని భట్టి నాకు అర్ధమైంది ఏమంటే.......కష్టే ఫలి.....కష్టపడం లోనే సుకం వుంది అని.....అది ఎంతో గౌరవాన్ని ఇస్తుంది అని.......


NCC నా వ్యక్తిత్వాన్ని బాగా తిర్చిదిధ్హిమ్ధి....నేను ఇప్పుడు ఎంతో ధైర్యం తో భయటకు వెళ్లి మాట్లాడగలను......నాకు ఏమి కావాలో తెలుసుకున్న.......ఇంక చాలా వున్నత మైన విలువల్ని అలవరుచుకున్న........ఏంటి సొంత డబ్బా అని అనుకుంటున్నారా......మీరేమైనా అనుకోండి...ఇది మాత్రం నిజం గా నిజం..........

నా సోల్లంత ఊపికగా చదివినందుకు ధన్యవాదాలు......

Wednesday, January 14, 2009

నేను ఎందుకు మగాడి లాగా పుట్ట లేదు?

అవునండి మీలో చాలా మందికి ఇలా అనిపించేవుంటుంది,నేను ఇలా ఎందుకు బాధ పడుతున్నానో తెలుసా,మన దేశంలో ఆడవాళ్లకు నిజం గా అంత స్వేఛ లేదు.ఎక్కడో పట్టణాల్లో వుందేమో గాని పల్లెటూర్లలో లేదు.
ఆడపిల్లలైతే తొందరగా పెళ్లి చేసిపంపిచేస్తారు..అదే మగాడైతే ఎంత కర్చైన సరే బాగా చదివిస్తారు(మన టీవీ లో వచ్చే adds లో కూడా మీ పిల్ల పెళ్ళికోసం insurance అంటారు గాని చదువుకోసం అని అనరు .మరి ఎందుకో ఆ difference .........ఆ విషయం కాసేపు పక్కన పెడితే.....

మా ఇంటిపక్కన రొజూ క్రికెట్ ఆడుతుంటారు ..నాకూ ఆడాలని వుంటుంది కానీ ఏం లాభం ఆడపిల్లై పుట్టేసాను....
పొనీ ధరైం చేసి ఆటకు వెళితే అందరూ వింత గా చూస్తారు..ఆడపిల్లవు నీకెందుకు అన్నట్లు.....
ఈ లోకం ఎప్పుడు ఆడవాళ్ళని మగాళ్ళని సమానంగా చూస్తారూ......

ఇంకా పని చేసే విషయానికి వస్తే...కొంచెం కష్టమైన పని అయితే నీ వల్ల కాదులే, అన్నయ్యో,తమ్ముడో చూస్తాడు వదిలెయి అంటారు...ఏం మేము చెయ్యలేమా....?
ఇంటిలో ఇద్దరు పిల్లలు వుంటే...కొట్టుకోవడం మామూలు విషయమే......అయితే.....మగాడితో నీకు గోడవెందుకే....అంటారు...లేదా.....ఆడపిల్లతో గొడవెందుకు రా అంటారు....యే మేము అంత చులకనగా కనిపిస్తున్నామా.....


ఇంటిలో భామ్మా విషయానికి వస్తే కూర కొంచెం తక్కువగా వుంటే,నాన్నకు వుంచు లేదా అన్నయ్యకో,తమ్ముడికో వుంచు అంటారు గాని నువ్వు వున్చుకో,నువ్వు తిన్నావా అని అడగరు.....నా భాధ...కూర గురించి కాదు...మా మీద అంత చులకన భావం ఏంటి అని.....మేమూ భయటకు వెళ్లి కష్టపడుతున్నాం గా.

ఇలా ఎన్నో వున్నాయి........కానీ ఒక్కటి మాత్రం నిజం....ఇలాంటివి తలుచుకున్నప్పుడు.. నాలో ఆత్మ విశ్వాసం మరింత పెరుగుతుంది........ఇలా ఆలోచించే వాళ్ల మొహం మీద కొట్టినట్లు గొప్పగా ఎదగాలి అని పట్టుదల పెరుగుతుంది.....

సో....నా ప్రియ స్నేహితులారా ......ఇలా ఆలోచించే వారికీ గుణపాఠం గా మంచిగా ఎదిగి చూపించండి.....అంతే గానీ..సున్నితమైన హృదయాలతో....యే అగాయిత్యాలు చేసుకోవద్దు .......

దేవుడు ఎప్పుడు మన పక్షానే వుంటాడు........

నేను ఎందుకు మగాడి లాగా పుట్ట లేదు?

నాకు చాలా బాధగా వుంది నేను మగాడిగా పుట్టనందుకు.ఎందుకు అనేది తర్వాత చెప్తా.